![]() |
![]() |

ఇటుక మీద ఇటుక పెట్టి అనే సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలుసు. ఢీ షో పండు ఈ సాంగ్ కి అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ చేసాక చిన్నా పెద్దా చాలా మంది ఈ సాంగ్ ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ సాంగ్ ని బాగా వైరల్ చేశారు. అలాంటి పండు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. "ఇటుక మీద ఇతుకు పెట్టి ఎన్ని ఇల్లులు కట్టారు ఇప్పటి వరకు" అని వర్ష అడిగేసరికి. ఇటుకులు పెట్టడమే సరిపోతోంది..ఇల్లు కట్టలేదు" అన్నాడు. వెంటనే వర్ష "బాబు ఇల్లు కట్టే టైపు కాదు.. ఇంట్లో దూరే రకం" అనేసరికి 'పిలిచి మరీ బాడ్ చేస్తున్నారు" అన్నాడు. "కొత్తగా బ్యాడ్ చేయాలా ఏంటి" అంది వర్ష నవ్వుతూ. "నేను కప్పు తీసుకునేవరకు ఏమీ అనను..కప్పు తీసుకున్నాక ఒక్కొక్కళ్ళను కప్పుతో కొడతాను" అన్నాడు పండు. "ఎనిమిదేళ్ల నుంచి నేను ఢీ చేస్తున్నా. ఈ సారి కప్పు నమదే...కొంతమంది డాన్స్ వేయట్లేదు అంటారు. ఏ జడ్జ్మెంట్ తో డాన్స్ లేదు అంటారో తెలీదు." అన్నాడు.
ప్రదీప్ తో చేశారు కదా మీ ర్యాపొ ఎలా ఉంది అని వర్ష అడిగింది. "మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రదీప్ అన్న నాకు హెల్ప్ చేసాడు. ఆయనే ఈ విషయాలు ఎక్కడా చెప్పనివ్వరు." అన్నాడు. "లవ్ చేస్తున్నానని చెప్పి రిలేషన్స్ మెయింటెయిన్ చేయడం మీద అభిప్రాయం" అనేసరికి "నీకు అమ్మాయిలతో టైం స్పెండ్ చేయాలి అనే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు నువ్వు లవ్ అని చెప్పుకోవడం వేస్ట్. నిజంగా ఎవరైనా మోసం చేస్తే ఖర్మ అని ఉంటుంది కదా అది వస్తుంది" అన్నాడు. "డబ్బుకు, మనుషులుకా.. ఎవరికీ విలువ ఇస్తావ్" అంది వర్ష. "ఈరోజుల్లో డబ్బులు లేకపోతే ఎవరూ విలువ ఇవ్వరు." అన్నాడు. "అసలు మీ సంపాదన ఎంత..ఇంత చేస్తున్నావ్ మరి " అంది. "నేను చేస్తోంది నా ఫామిలీ గురించి. నాకు ఇంతవరకు సొంత ఇల్లే లేదు" అన్నాడు పండు. "స్నేహితులు పొడిచే వెన్నుపోటు చాలా బాధ కలిగిస్తుంది..నీ లైఫ్ లో ఎప్పుడైనా అలాంటిది జరిగిందా " అంది వర్ష. "ఒకప్పుడు నేను ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేశా. కొన్ని ప్రాబ్లమ్స్ వలన దూరమయ్యాను. అందుకే నేను ఎక్కువగా ఫ్రెండ్స్ ని చేసుకోను. నా చేతి మీద పచ్చబొట్టు ఉందిగా హరి అని అతనే" అన్నాడు పండు.
![]() |
![]() |